బ్రహ్మ విహార
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అవధులు లేని నాలుగు అలౌకికావస్థలు (అప్పమజ్ఞ). అవి: 1. మెత్తా (మైత్రి), 2. కరుణ, 3. ముదితా (అలౌకికా నందం), 4. ఉపెక్ఖా (నిశ్చలత). సాధకుడు ధ్యానంలో తనకైనా, మరెవరికైనా మేలు చేసే, శుభకరమైన మానసిక స్థితులను పెంపొందించుకొని, వాటి ప్రభావాన్ని అన్ని దిక్కులకూ ప్రసారం చేస్తాడు. సమస్త జీవుల పట్ల అపరిమితమైన దయను చూపించడం మైత్రీ బ్రహ్మ విహార. బాధితుల పట్ల అపరిమితమైన కరుణ చూపించడం కరుణ బ్రహ్మ విహార. ఇతరులు దుఃఖం నుంచి విముక్తి పొందినప్పుడు అపరిమితమైన ఆనందాన్ని పొందడం ముదిత బ్రహ్మ విహార. మిత్రుడి పట్లా, శత్రువు పట్లా అత్యంత సమదృష్టితో వ్యవహరించడం ఉపేక్షా బ్రహ్మ విహార. తనవారైనా, పరాయివారైనా కష్ట పడుతుంటే కుంగిపోకుండా, సుఖ పడుతుంటే పొంగిపోకుండా ఉండే మానసిక స్థితిని పొందడానికి ఈ సాధన ఉపయోగిస్తుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు