బ్రహ్మంగారిపుజ
బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని ఆయన నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిపించాడు.వారు రాగానే స్వయంగా స్వాగతంచెప్పి ఆయనను ఆసీనులను చేసారు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు.అయినా ఆయనకు మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేసాడు.నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు.ఆయన పళ్ళెరం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేసాడు.ఆపళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది.ఈ సంఘటనతో నవాబుకు ఆయన మహిమలపై విశ్వాసంకుదిరి ఆయనను పలువిధాల ప్రశంసించారు.ఆ సందర్భంలో బ్రహ్మంగారి నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు.ఆతరువాత నవాబు ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపారు.
విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి. ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు. బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. కడపనవాబు కు జ్ఞానబోధ అహోబిలం శ్రీలక్ష్మీనృసింహుని దర్శనం చేసుకుని అక్కడి నుండి కడప చేరి నవాబుకు కబురు పంపాడు. వెంటనే నవాబు సపరివారంతో వచ్చి స్వాగతం చెప్పి ఆయనను గౌరవంగా తనవెంట తీసుకు వెళ్ళారు. నవాబు బ్రహ్మంగారి మహిమలు చూడాలని ఆసక్తి కనబరిచాడు. ఆయనను మరుసటి నాటి సభకు రమ్మని ఆహ్వానించాడు. బదులుగా బ్రహ్మంగారు చిరునవ్వుతో "నీ మనసులో కోరిక నాకు అర్ధమైంది. నువ్వు అనుకున్నది నేను చేసి చూపగలను " అన్నాడు. నవాబు తన మనసులోని కోరిక ఆయనకు ఎలా తెలిసిందో తెలియక ఆశ్చర్యపడినా మరుసటి నాటి సభకు ప్రజలను రమ్మని చాటింపు వేయించాడు. మరుసటి నాటి సభలో నవాబు బ్రహ్మంగారితో "స్వామీ! నావద్ద ఒక చూడిగుర్రం ఉంది అది ఆడ గుర్రాన్ని కంటుందో మగ గుర్రాన్ని కంటుందో తెలియచేయండి " అన్నాడు. బ్రహ్మంగారు చిరునవ్వుతో ఆ గుర్రాన్ని తెప్పించమని కోరగా గుర్రాన్ని సేవకులు సభకు గుర్రాన్ని తీసుకు వచ్చారు. దానిని చూసి "దీని గర్భంలో నాలుగు తెలుపు రంగు కాళ్ళు ,నొసట చుక్క,పువ్వుల తోక కలిగిన మగ గుర్రం జన్మిస్తుంది" అన్నాడు. ఆ తరువాత నవాబు సందేహం తీరలేదని గ్రహించి "ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువుని చూడటమే నీ ఉద్దేశ్యం అని అర్ధం అయింది. అది చూసే వరకు నాపై నీ సందేహం తీరదు ఔనా" బ్రహ్మంగారు నవాబుతో చెప్పాడు. అంగీకారంగా నవాబు తల ఊపడం చూసి ఆయన