వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

(బైబిల్‌) పవిత్ర గ్రంథం. దైవ సంబంధమైన, ఆధ్యాత్మికమైన వాక్య సముదాయం. ఇవి ప్రత్యక్షంగా దైవం నుంచి వచ్చినవి కావచ్చు, దైవ దూతలు చెప్పినవి కావచ్చు, మహనీయులు ప్రవచించినవీ కావచ్చు. ఇంగ్లీషులో వీటిని Scriptures (స్క్రిప్చర్స్‌) అన్నారు.క్రీస్తుకు పూర్వం నుంచి బైబిల్‌ ఉంది. అప్పటి నుంచి ఉన్న భాగం హీబ్రూ భాషలో ఉంది. దానిని Old Testament (ఓల్డ్‌ టెస్టమెంట్‌) అన్నారు. ప్రాచీన నిబంధన అనీ పూర్వ నిబంధన అనీ, పాత నిబంధన అనీ తెలుగులో వాడుకలో ఉన్న పదాలు. యేసు అవతరణ అనంతరం మరొక భాగం చేరింది. New Testament (న్యూ టెస్టమెంట్‌) అని దానికి పేరు. నూతన నిబంధనగా ఇది తెలుగులో వాడుకలోకి వచ్చింది. బైబిల్‌ ఏకవచనంగా ధ్వనించే పదమే గాని, అది ఒక పుస్తకం కాదు. కొన్ని పుస్తకాల సముచ్చయం. ఓల్డ్‌ టెస్టమెంట్‌లో 39 (43 అని కొందరు) పుస్తకాలు ఉన్నాయి. న్యూ టెస్టమెంట్‌లో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 66 (అరవై ఆరు) పుస్తకాలు (మొత్తం 72 అని కొందరు). 43 అంకె కథోలిక సంస్థ ప్రకారం. రెండిటిలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఓల్డ్‌ టెస్టమెంటులో 2,278,100 అక్షరాలూ, న్యూ టెస్టమెంటులో 8,38,380 అక్షరాలూ ఉన్నాయంటారు. ఇరవయ్యవ శతాబ్దివరకు తెలిసిన సమాచారం మేరకు బైబిల్‌ 1251 భాషలలో పంపిణీ జరిగింది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బైబిల్‌&oldid=861977" నుండి వెలికితీశారు