- బ్రహ్మ పురాణం / బ్రహ్మ పురాణము - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
- పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
- విష్ణు పురాణము - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
- శివ పురాణము - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
- లింగ పురాణము- నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
- గరుడ పురాణము - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
- నారద పురాణము- నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
- దేవి భాగవత పురాణము - శుక మహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
- అగ్ని పురాణము - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
- స్కాంద పురాణము - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
- భవిష్య పురాణము లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
- బ్రహ్మవైవర్త పురాణము - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
- మార్కండేయ పురాణము - పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయ మహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
- వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
- వరాహ పురాణము - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
- మత్స్య పురాణము - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
- కూర్మ పురాణము - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
- బ్రహ్మాండ పురాణము - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.