పిండారకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకానొక పుణ్యక్షేత్రము. ఇది ద్వారకాపుర సమీపమున ఉండును. ఇందు కొందఱు మహర్షులు తపము ఆచరించుచు ఉండఁగా యాదవులు దర్పించి కృష్ణుని పుత్రుఁడు అగు సాంబుని గర్భిణీస్త్రీరూపముగ అలంకరించి, ఈచూలాలికి ఏశిశువు కలుగును చెప్పుఁడు అని పరిహాసముగ అడుగ, వారు అది ఎఱిఁగి మిగుల కినుకతో యదుకులమును నిర్మూలము చేసెడు ఒక ముసలము ఉదయించును అనిరి. అనంతరము సాంబుని గర్భమునందు ఒక ముసలము పుట్టెను. అది చూచి వారు మిగుల జడిసి ఆముసలమును చూర్ణము కావించి సాగరమున కలిపిరి. అంత ఆచూర్ణము ముయ్యంచు తుంగగా మొలిచెను. పిదప కొంతకాలమునకు యాదవులు అందఱు సముద్రస్నానముచేయ పోయి మదిరాపానమత్తులు అయి ఒకరితో ఒకరు కలహించి ఆ ముయ్యంచు తుంగ పెఱికికొని ఒకరిని ఒకరు కొట్టుకొని చచ్చిరి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు