పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
నోట్లో ఉన్న పళ్ళు ఊడగొట్టుకోదలచినప్పుడు ప్రత్యేకమైన రాయి అవసరంలేదు. అందుకు ఏ రాయైనా సరిపోతుంది. అదే విధంగా తనకు తాను స్వయంగా నష్టం కలిగించుకుంటున్నప్పుడు అది ఏ పధ్ధతిలో జరిగినా ఒకటేనని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.