వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • అభిమన్యు-ఉత్తర లకు పుట్టిన వాడు. అర్జునునికి మనుమడు. జనమేజయుడు ఈయన పుత్రుడు. పరీక్షిత్తు అంటే అంతటా దర్శించగల వాడని అర్ధం.
  • 1. కురుని కొడుకు.
  • 2. అభిమన్యుని కొడుకు. తల్లి ఉత్తర. కొడుకు జనమేజయుఁడు. ఇతఁడు ఒకనాఁడు వేఁటాడ పోయి ఒక వనము నందు తన యేటు తప్పించుకొని పాఱిపోయిన మృగమును వెదకుచు, మౌనవ్రతమును ధరించి తపస్సుచేయుచు ఉండిన శమీకుఁడు అను ఋషిని కని, మృగము ఎటుపోయెను అని అడిగి అతఁడు ఉత్తరము చెప్పకపోఁగా, తన్ను అతఁడు లక్ష్యముచేసి మాటలాడకపోయెను అని ఎంచి ఒకమృతసర్పకళేబరమును అతనికంఠమునందు మాలగా వైచి తన పురమునకు వచ్చి చేరెను. అంతట అతని కొడుకు అగు శృంగి తన తండ్రిమెడను రాజు చచ్చినపామును వైచిపోయెను అను మాట విని అది మొదలు ఏడు దినములలోపల ఇతఁడు తక్షక నాగముచే కఱవఁబడి చచ్చుఁగాక అని శపించెను. ఆవృత్తాంతము ఇతఁడు విని విరక్తుఁడై శుకమహర్షివలన భాగవతమును విని ఆయేడవనాడు తక్షకుఁడు వచ్చి కఱవఁగా మృతుఁడై ముక్తిని ఒందెను. పిదప ఇతని కొడుకు అగు జనమేజయుఁడు రాజ్యముచేయుకాలమున ఉదంకుఁడు అను ఋషి (తాను గురుకార్యార్థము పోవునపుడు తనకు అపరాధముచేసిన రక్షకునియందలి విరోధముచేత) జనమేజయుని వద్దకు పోయి మీ తండ్రి అగు పరీక్షిత్తును తక్షకుఁడు కఱచి చంపెను కనుక అట్టిదుష్టుని సపరివారముగ నాశనముచేయుట ఉత్తమము లని చెప్పి అతనికి సర్పయాగము చేయ బుద్ధిని పుట్టించెను. అట్లు ఉదంకునిచే ప్రేరేఁపింపఁబడి జనమేయునిచే చేయఁబడిన సర్పయాగము వాసుకి చెలియలు అగు జరత్కారు కొడుకు అస్తీకునిచే నివారింపఁబడెను. అనంతరము జనమేజయుఁడు వ్యాసుని అనుమతిని భారతకథను వైశంపాయనునిచే వినెను.
  • 3. సూర్యవంశమున పుట్టిన రాజులలో ఒకఁడు. ఇతఁడు అయోధ్యను ఏలుచు ఉండెను అని భారతమున చెప్పఁబడి ఉన్నది. ఇతఁడు ఒకప్పుడు వేఁటాడపోయి మార్గమున సుశోభ అను పేరుగల మండూక రాజు కూఁతురు అగు ఒక కన్యకను వివాహమై ఆమెయందు మువ్వురు పుత్రులను పడసెను. ఆమె మిక్కిలి దుష్టప్రవర్తనము కలది అయి అనేకులను ప్రసిద్ధులగు రాజులను చిక్కుల పెట్టినందున తన పుత్రులు కపటులు అగునట్లు తన తండ్రిచే శపింపఁబడెను.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>