నేలగుమ్మడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>. కొన్ని గిరిజన గ్రామాల్లో నేలగుమ్మడిని దారి గుమ్మడి అని కూడా అంటారు. ఈ మొక్క భారత దేశంలో ఉన్న తూర్పు కనుమలు, పడమటి కనుమలు, మరియు ఈశాన్య రాష్ట్రాల అడవుల్లోను, నేపాల్ మరియు పాకిస్థాన్ దేశాల్లోను కనిపిస్తుంది. గిరిజనులు ఈ మొక్క నుండి లభించే రసాన్ని చర్మ వ్యాధులకి, లైంగిక పటుత్వానికి వాడతారు.
ఉపయోగాలు: ఒరిస్సా మయూర్ భంజ్ జిల్లాలో గిరిజనులు కీళ్ళ నొప్పులకి నేలగుమ్మడి వేరును ముద్దగా చేసి ఒంటికి వ్రాసుకుంటారు . ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గిరిజనులు గుండె నొప్పి వచ్చే సమయంలో విదారికంద వేరుని పొడిలో పంచదార కలిపి మాత్రలుగా చేసి, రోజులు 2 సార్లు చొప్పున 4 లేక 5 రోజులు సేవిస్తారు. నిస్సత్తువ నుండి ఉపశమనం పొందడానికి ఉడికించిన విదారికంద వేళ్లను రోజుకు 2 సార్లు చొప్పున 3 వారాలు తింటారు. అక్రమ చొరబాటుదారుల వల్ల ప్రస్తుతానికి ఈ నేలగుమ్మడి జాతి అంతరించిపోయే దశలో ఉంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు