నెల్లూరు నెఱజాణ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఈమె కాంచీపురపు ఏలేశ్వరోపాధ్యాయుని కూతురు నంగనాచివంటి నేర్పరి. మాటలు పొంకము గలది. ఎన్నియో ఛలోక్తులు చమత్కారములు చేష్టలుఈమెకు అంటగట్టబడి యున్నవి. ప్రతిది తెనాలి రామలింగనికి అతికించబడినట్లు, గడుసుమాటలన్నియు యీమెకే అంకితమైయున్నవి. నెల్లూరు దక్షిణంలో దుర్గా (దర్గా) మెట్టలోనున్న యామాలసెట్టి (వేములసెట్టి) బావినీళ్లు త్రాగినందుననే యీ చమత్కారము నెల్లూరివారికి అబ్బినదని ప్రతీతి. ఈమెకు ఎదురు ఉద్ది - రావూరు రసికుడు. ఈగ్రామము నెల్లూరుకు తూర్పున, సమీపమున నున్నది. నెల్లూరు నెఱజాణ-రావురు రసికుడు అన్నది జంటమాట అయిపోయినది. ఈమె 'దోమతలనెల' అంటే మార్గశిరమని, 'నపుంసకుని గుద్దలో వెండ్రుక'లంటే నెమలిఈకలని రసికుడు అర్థము వేయును. 'పిల్లా పెట్టనిస్తావా?' (కోడిపెట్ట) అని అంటే 'అమ్మనయ్యా' (తల్లిని అనుట) అని చెప్పివేసింది నెఱజాణ. ఇట్టివి వీరి ఛలోక్తులు- చమత్కారములు!.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు