నృపనాపితపుత్రన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రాజు, మంగలివానికొడుకు వలె. క్షౌరము చేయించికొనుచు ఒకరాజు మంగలివానితో 'ఓరీ! ఊరిలో తిరిగి ఎచటనైన ఒక చక్కని పిల్లవానిని చూచి తీసికొనిరమ్ము' అనెను. అట్లే మంగలి ఊరంతయు దిరిగెను. కాని చక్కని పిల్లవాడు కనబడలేదు. విసివి తుదకు వాడు అష్టావక్రునివలె నున్నను తన కుమారుని చూచి 'ఆహా! వీడెంత అందగాఁడు! అని మురియుచు రాజువద్దకు గొనిపోయి "రాజా! చూడుము, చాలకష్టపడి కొనివచ్చితిని" అనెను. ఆపిల్లవానిని చూడగనే మంగలి తనను ఎగతాళి చేయుచున్నాడని రాజున కొడలు తెలియని కోపము వచ్చెను. 'ఓరీ! వీడెవఁడురా?' అని రాజు ప్రశ్నించెను. 'వీడా!' నాకొడుకేనండీ' అని మంగలి చెప్పెను. రాజు 'ఎవరి కొడుకులు వారికి అంత అందముగా కనిపించుట లోక ధర్మము' అని శాంతి వహించి వానిని పంపివేసెను.(అద్దములో దనముఖ మెంతసేపు చూచుకొనినను గురూపికిసయితము తనివి యుండదు. ఎవనిభార్యముఖము వానికి పూర్ణచంద్రుడు కదా!.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు