నాళీజంఘుడు ఒక బకశ్రేష్ఠుడు. మధ్యదేశమునందు గౌతముడు అను బ్రాహ్మణుని కొమారుగు ఒకడు, వేదాధ్యయనాది విప్రకర్మ విరహితుఁడు అయి బోయలతో కలసి ధనము ఘటింప తిరుగుచు ఒకనాఁడు నాళీజంఘుని ఒద్దకు పోఁగా అతఁగు తన సఖుఁడు అగు ఒక దైత్యభర్తవలన వానికి ధనము ఇప్పించెను. ఆధనమును కైకొనిపోవునపుడు ఆక్రూరుడు కొంత అయిన నెనరు లేనివాఁడు అయి, నిద్రపోవుచు ఉన్న నాళీజంఘుని తన ఆహారార్థము చంపెను. అంత నాళీజంఘుని చెలికాఁడు అగు దైత్యుడు ఇది ఎఱిఁగి ఆబ్రాహ్మణుని వధించెను. వాఁడు కృతఘ్నుడు ఐనందున వాని మాంసమును కుక్కలుకూడ ముట్టవయ్యె. ఆవల నాళీజంఘుడు తన మహనీయత వలన పునర్జీవితుడు అయి బ్రాహ్మణుని మరల బ్రదికించి ఇఁక ఇట్లు చేయకుము అని బుద్ధిచెప్పి పంపెను. నా|| రాజధర్ముడు.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు