దూరమానము
దూరమానం అనగా దూరాన్ని కొలువడానికి మరియు వ్యక్తపరచడానికి ఉపయోగించే పదం లేదా పదబంధం.
గత కాలంలో దూరాన్ని క్రోసులు, ఆమడలు అని విలిచేవారు. ఉదాహరణకు ఈ వూరినుండి ఆవూరికి 10 క్రోసులు దూరమున్నది అని అనేవారు. అదే విధంగా ఆమడ అనేది కూడ గత కాలంలో వాడిన పదమే. తక్కువ కొలతలను జానెడు, మూరెడు, బారెడు అని పిలిచేవారు. బట్టలను మూర లతో కొలిచేవారు.
ప్రస్తుతము మెట్రిక్ విధానములో దూరాన్ని కిలోమీటరు, హెక్ట మీటరు అని వాడుతున్నారు. చిన్న పరిమాణములో దూరాన్ని సెంటీ మీటరు, మీటరు లలో కొలుస్తారు. బట్టలు మున్నగు వాటిని సెంటి మీటరు, మీటర్లలో కొలుస్తారు.