వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

స్వామి దయానంద సరస్వతి క్రీ.శ.1875 సంవత్సరంలో ప్రారంభించిన ధార్మికోద్యమం ఆర్య సమాజం. వేదాలను ప్రమాణంగా గ్రహించి వేదాలను, స్మృతులను ప్రబోధిస్తూ దయానందుడు సమాజంలో అప్పటికి పాతుకొని ఉన్న మూఢ విశ్వాసాలను, వేదాలకు, స్మృతులకు ప్రచారం లో ఉన్న కొన్ని తప్పుడు వ్యాఖ్యానాలను ఖండించారు. వైదిక సమాజాన్ని వేదాలే ప్రమాణంగా సంస్కరించడానికి పూను కొన్నారు. వేదాధ్యయనానికి స్త్రీలూ, అన్ని వర్ణాలవారు అర్హులేనని దయానందుడు ఉద్బోధించారు. ఆర్య సమాజం ఉద్యమం వల్ల ఎందరో బ్రాహ్మణేతరులు సంస్కృత భాషను, వేదాలను అధ్యయనం చేసి మహా పండితులు కాగలిగారు. పుట్టుక చేత బ్రాహ్మణులైన వారు ఏ కారణం చేతనైనా వేదం చదవకపోతే వేదాలు కనుమరుగై పోతాయనే పరిస్థితి మారింది. ఆయన రచించిన సత్యార్థప్రకాశం ఆర్య సమాజికులకు పరమ ప్రమాణ గ్రంథం. రాజనీతితో సహా వివిధ వైదిక ధార్మిక విషయాలపై ఈ గ్రంథంలో వివరణలు ఉన్నాయి. 21 శతాబ్దం నాటికి ఆర్య సమాజం ఒక బలమైన వ్యవస్థగా నిలచి ఉంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>