తూరుపెత్తు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తూరుపు+ఎత్తు:ధాన్యములను చేటతో ఎత్తి తూరుపుగాలికి విడుచు -శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ఏదేని గాలివాటముకు ధాన్యమును చేట/తట్టతో ఎత్తివిడచుట
- 1. గాలి కెగురఁబోయు.2. తలవెండ్రుకలు దులుపు, జాడించు.3. తూరుపాఱఁబెట్టు.4. తిట్టు.5. బాధించు. [చంద్రో. 3ఆ.] ....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వెండ్రుకలు పాయదీసి ఎత్తిపట్టు
- సంబంధిత పదాలు
తూరుపట్టు, తూరుసారబెట్టు, తూర్పారబట్టు, తూరుపెత్తు, తూర్పెత్తు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "గీ. రట్టుగా నన్ను మగనాలిఁ బట్టిడాసి, తౌర మొఱ్ఱోయనుచు దుమ్ము తూరుపెత్తు." శుక. ౨, ఆ.
- "గీ. ఎలయు సీత్కారములతోడ నీళ్లు గ్రుక్కి, యంట్లుసంట్లును బరికించి యంట్లఁ బొడిచి, గోరు ముక్కులడిగ దువ్వి తూరుపెత్తి, నెఱులఁ గల్గిన పేలనన్నింటిఁ దిగిచి." పాండు. ౩, ఆ.