తినగ తినగ వేము తియ్యగనుండు

ఈ సామెత వేమన శతకంలోని ఒక పద్యం నుంచి ఉద్భవించింది.

 అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
 తినగ తినగ వేము తియ్యగుండు
 సాధనమున పనులు సమకూరు ధరలోన
 విశ్వధాభిరామ వినుర వేమ

సాధన చేస్తూ ఉంటే పనులు సులభతరమౌతాయని దీని అర్థం.