తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట

ఎవరైనా తాడిచెట్టు ఎక్కేది కల్లు కోసమే. అలా కాదిని దూడ గడ్డికోసమని చెబితే ఎవరూ నమ్మరు. ఇదే విధంగా బహిరంగంగా ఒక పని చేస్తూ దొరికిపోయి కప్పిపుచ్చాలని చూసినప్పుడు వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు.