తలీకరణ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం, ఏక వచనం
- వ్యుత్పత్తి
- ఒకే తలంలో ఊగిసలాడేటట్లు చేసిన
- బహువచనం
- తలీకరణలు
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇది ఇంగ్లీషు లోని polarization అనే మాటకి సరితూగే మాట. ఇంగ్లీషులో ఇది misnomer, అనగా అర్థంతో పొందు కుదరని మాట. ఈ ప్రక్రియ పరిపూర్ణంగా అర్థం కాని రోజులలో కాంతి కణాల రూపంలో ఉంటుందనిన్నీ, ఆ కణాలన్నీ బుల్లి బుల్లి అయస్కాంతాలలా ఉంటాయనిన్నీ అనుకునేవారు. ఈ అయస్కాంతాల ఉత్తర, దక్షిణ ధ్రువాలు (poles) చెదురుమదురుగా అన్ని దిశలలోకీ తిరిగి ఉంటే ఆ కాంతి unpolarized అనిన్నీ, ధ్రువాలు అన్నీ కవాతు చేస్తూన్న సైనికులలా బారులు తీరి, అన్ని ఉత్తర ధ్రువాలు ఒక దిశ లోనూ, అన్ని దక్షిణ ధ్రువాలు వ్యతిరేక దిశలోను తిరిగి ఉంటే ఆ కాంతి polarized అనిన్నీ అనుకునేవారు. కాని ఈ సిద్ధాంతం తప్పని తేలింది. పేరు మాత్రం అతుక్కు పోయింది.
కాంతి విద్యుదయస్కాంత తరంగాలని మనకి తెలుసు. విద్యుత్ తరంగాలు ఒక దిశలో ఉన్న తలంలో ఊగిసలాడితే అయస్కాంత తరంగాలు వాటికి లంబ దిశలో ఉన్న తలంలో ఊగిసలాడతాయి. ఈ రెండు పరస్పర లంబ దిశలకీ లంబంగా ఉన్న మూడవ దిశలో కాంతి తరంగం ముందుకి కదులుతుంది. ఇలా ప్రయాణం చేస్తూన్న తరంగానికి అడ్డుగా "నిలువు కంతలు" (vertical slits) ఉన్న జల్లెడని పెడితే ఆ జల్లెడ గుండా ఒక తలంలో ఉన్న తరంగాలు మాత్రమే దూసుకు పోగలవు. ఇలాంటి జల్లెడ గుండా ప్రయాణించి బయటకి వచ్చిన తరంగాన్ని "తలీకరించిన" తరంగం అందాం - అంటే "ఒకే తలంలో ఊగిసలాడేటట్లు చేసిన" అని అర్థం. దీనినే ఇంగ్లీషులో polarized light అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
లేవు
- సంబంధిత పదాలు
- చక్రీయ తలీకరణ = circular polarization
- వ్యతిరేక పదాలు
- లేవు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>polarized sunglasses = తలీకరించిన చలవ కళ్లజోళ్లు