తదంతాపకర్షన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తదంతము అనగా అది అంతమందుగలది అని అర్థము (బహువ్రీహిసమాసము). తదంతసముదాయము నాకర్షించినట్లు అని న్యాయార్థము. విడదీయ వీలులేని యొకవస్తుసముదాయమున్నదనుకొనుడు. వానిలో నేది కదలించినను అన్నియు గదలును. మొదలు కదలించిన చివర, చివర కదలించిన మొదలును కదలును. ఉదాహరణమునకు రైలును తీసికొనుఁడు. రైలుపెట్టెలలో నేకొన, లేక నడిమిభాగమును కదలించిన సముదాయము నంతయు నపకర్షించును. అట్లే- అనుయాజాద్యుత్కర్ష ప్రయాజాన్తాపకర్షణాధికరణము నెఱుంగునది. అనుయాజ, ప్రయాజాదులు కొన్ని హోమవిశేషముల సముదాయము. వానికి అనుయాజాదులు మొదలు; ప్రయాజాదులు తుదియు. ఈసముదాయమున నేయొకటి గ్రహించిన నన్నియు క్రమమున వచ్చును. కావున- ఒకటి గ్రహించిన తత్సంబద్ధసముదాయమంతయు దానిచే నపకర్షింపఁబడు నవసరమున నీన్యాయము ప్రవర్తించునని యెఱుంగునది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>