జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి

ఒక్కొక్క వ్యక్తికి నచ్చే ఆహారపదార్థాలు, వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒకరికి నచ్చే పదార్థాలు మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి వచ్చే ఆలోచనలు మరొకరికి రుచించకపోవచ్చు. అంతమాత్రాన ఒకరి రుచులూ, అభిరుచులూ, ఆలొచనలు, అభిప్రాయాలూ వేరొకరి వాటికంటే గొప్పవని ఎవరూ భావించరాదు అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు.