చేతన్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
.తృతీయా విభక్త్యర్ధము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తోన్, చేతన్ అను తృతీయా విభక్త్యర్ధమును తెలుపును. ఈయర్ధమును లాక్షణికులు గ్రహించినట్లు కనఁబడదు. నన్ అను విభక్తిప్రత్యయమువలె అందున్ అనునది తృతీయావిభక్త్యర్ధమున వచ్చును. ఈక్రింది యుదాహరణముల ననుసరించి ఈవిశేషార్ధము గ్రహింపఁబడినది. " శా. బేటం బేటముగా నిభంబుకరిణిం బ్రేమంబుతో జేరి లా, లాటంబొత్తు లలాటపట్టమునఁ గేలంగేలు వేష్టించుగ్రీ, గోటన్ మే యొరయన్ వరాంగములు సోఁకుం బుష్కరాగ్రంబునం, దాటోపం బొనరించు గూడ బ్రియ గామాసక్తి నాసక్తిమై." కు.సం. ౧,ఆ. ౧౦౦. "స్వా. ఆగిరీంద్రసుత హర్షముతో శై, వాగమోదిత విధాయతితో సు, స్వాగతాభిమత వాక్యములం ద,భ్యాగతోచిత సపర్యలఁదన్పెన్." కు.సం. ౭,ఆ. ౫. "ద్వి. అ.గాక గర్వించినట్టిరావణుని, నదుమఁడే శివుడు పాదాంగుష్ఠమంద, మలహరుతో మాఱుమలసి కాముండు, నిలయెల్ల నెఱుగ నేఁటేఁటగాలండె." బస.౬,ఆ. ౨౦౩ పు. "తరలము. కడగి బుద్ధి బలంబునంద యకంటకంబుగజేసి యే, బుడమిరాజ్యము సర్వముం దగబుచ్చి యిచ్చిన నిమ్ములం, గుడువనేరక దీని నిచ్చటఁ గూలదన్ని శరీరమున్, విడుతుఁగాకని నిశ్చయించెదు వెఱ్ఱివైతె నరేశ్వరా." భార. అర.౬,ఆ. ౩౨. "తే. వినినయప్పుడ ప్రాణముల్ విడువగలరు, మువ్వురము గూడ నీశిలీముఖమునందు, దెగితిమేమని దైవంబు తెంపు జెప్ప, నకట! హాతల్లి, హాతండ్రి యనుచు నడలె." రా.అయో.౩౧౯.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు