చర్చ:సాక్ష్యాధారము

తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: శశికాంత్
  • సాక్ష్యాధారము అనేది సరైన పదం కాదని నా అభిప్రాయం. సాక్ష్యాధారాలు అనేది సబబు. దీనికి ఏకవచనం ఉండదు. ఎందుకంటే భార్యాభర్త, అన్నదమ్ముడు అని వాడరు, భార్యాభర్తలు, అన్నదమ్ములు అని వాడతారు. ఇక్కడ సాక్ష్యము , ఆధారము అనేవి రెండు ఉన్నాయి గనక బహువచనం అవుతుంది , అందువలన సాక్ష్యాధారాలు అని వాడాలి. గమనించగలరు --శశికాంత్ 18:30, 15 నవంబరు 2010 (UTC)Reply
  • సామాన్యంగా సాక్ష్యాధారాలను అనుసరించి అనే వస్తుంది. న్యాసథానములో ఒక్క సాక్ష్యాధారాన్ని సమర్పించినప్పుడు దానిని ఏక వచ ప్రయోగము చేయవచ్చు. ఉదాహరణగా :- నేరము జరిగిన ప్రదేశంలో ఇఒకే వస్తువు లభించి నప్పుడు దానిని సాక్ష్యాధారము అనే వ్యవహరిస్తారు.
  • భార్యాభర్తలు, తల్లితండ్రులు, అన్నదమ్ములు లాంటివి అనేది సమాసము . సమాసములో రెండు నామవాచకములు ఉంటాయి కనుక దానికి బహువచన ప్రయోగము చేయాలి. వాటి కూడా గాలి వాన, మాటా మంతీ, ఇరుగూ పొరుగూ లాంటు అనేక సమాసాలకు బహువచన ప్రయోగము ఉండదు.
  • సాక్ష్యాధారాలు అనే పేజీ సృష్టిస్తే ఎవరైనా సాక్ష్యాధారము అనే దానికి వేరొక పేజీ సృష్టించే అవకాశం ఉంది.రెండు పేజీలో విషయం ఒకటే కనుక సభ్యుల సమయం వృధా కావడమే కాక. సర్వర్ల స్థానము వృధా ఔతుంది. అందుకోసమే ఆలోచించి వీలైనంత వరకు ఏకవచన పదాలకు మాత్రమే పేజీలు సృష్టిస్తున్నము. ఈ విషయమై ఇది వరకే చర్చించి బహువచనాలకు పేజీలు అవసరం లేదని సీనియర్ సభ్యులు అభిప్రాయపడ్డారు. చెప్పులు, కమ్మలు, గాజులు, కళ్ళద్దాలు వంటి ప్రత్యేక పదాలకు మాత్రమే బహువచన ప్రయోగము చేయాలని సీనియర్ సభ్యులు అభిప్రాయం వెలిబుచ్చారు.

--T.sujatha 02:13, 16 నవంబరు 2010 (UTC)

Return to "సాక్ష్యాధారము" page.