చర్చ:తెలుగు విక్షనరీ అభివృద్ధి-T.sujatha

తాజా వ్యాఖ్య: రెండవ సమీక్ష టాపిక్‌లో 14 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

మెరుగుకు సూచనలు

<small>మార్చు</small>
  • మొదటిగా మీరు ఈ వ్యాసాన్ని ప్రారంభించినందులకు ధన్యవాదాలు. మెరుగు పరచటానికి నా సూచనలు గమనించండి.
  • దీనిని మాటామంతీగా కాక తెలుగు విక్షనరీ అభివృద్ధి అనే శీర్షిక బాగుంటుంది. కొన్ని విషయాలు మాటామాంతీలో కూడా చేర్చొచ్చు, అది వేరే వ్యాసంగా తరువాత ప్రచురిద్దాం. దీనిని కొత్త శీర్షికతో మీ తెవికీ సభ్యపేజీలో ప్రయోగాత్మక వ్యాసము గా మార్చండి, లేక కొత్తదిగా సృష్టించండి.
  • విక్షనరీ గురించిన వ్యాసం తెవికీలో మొలకగా వుంది. దానిని విస్తరించి లేక నిఘంటువు లో కలిపి, విక్షనరీ ప్రాజెక్టు ఎలా ప్రారంభమైంది, ఎలా అభివృద్ధి చెందింది కొన్ని గణాంకాలు చేర్చి వివరించితె బాగుంటుంది. ఆ వివరాలు మీకు ఇప్పటి తెలుగు వికీపీడియా వ్యాసములో కొన్ని దొరకవచ్చు. వీటినుంచి కొంత సమాచారము ఈవ్యాసానికి వాడుకోవచ్చు.
  • మీ వ్యక్తిగత అనుభవాలలో ఏవిధంగా పనిచేస్తే త్వరగా చేయకలిగారు. మీకు ఉపయోగపడిన వనరులు అవి పేర్కోనండి. మీ వ్యక్తిగత అభిప్రాయాలు రాసే సౌలభ్యము ఈ వ్యాసము లోనే వుంది. ఆ విషయాలను విస్తరించండి. ఉదా:సాంకేతిక మాటలను అనువాదము చేయడంలో ఇబ్బందులు గురించి మీరు పనిచేసినట్లయితే వాటిని గురించి రాయవచ్చు. మీరు ఇంకాచూచివుండకపోతే తెలుగు వెలుగులేవి , అద్దంకి శ్రీనివాస్ వ్యాసాన్ని చూడండి.
  • విక్షనరీ కి ఎక్కువ పనిచేసిన వారితో కలిసి వ్యాసాన్ని విస్తరించవచ్చు.
  • అక్షర దోషాలు కొంచెము ఎక్కువగా కనపడ్డాయి, వాటిని సవరించండి. నేను తెవికీ కి మార్చిన తరువాత సహాయము చేస్తాను.
  • తెవికీ వార్త తరువాత సంచిక ముఖ్య వ్యాసము ఇదే.

ధన్యవాదాలు--Arjunaraoc 04:33, 3 సెప్టెంబరు 2010 (UTC)Reply

రెండవ సమీక్ష

<small>మార్చు</small>
  • వ్యాసము బాగా మెరుగయింది. అయితే కొంత సమాచారము (మీ ప్రవేశము, సాంకేతికము, అభివృద్ధిలో కొంత) మిగతా చోట్ల (తెవికీలో విక్షనరీలో )రాసి లింకులుదహరిస్తే బాగుంటుంది.
  • తెవికీ లో సభ్యపేజీలోకి మార్చి, మాటామంతీ వ్యాసం, తెలుగు విక్షనరీ అభివృద్ధి వ్యాసాలు మొదలుపెట్టి సమాచారాన్ని వాటికి అనువుగా చేర్చండి. మీరు మాటామంతీ ఇష్టపడక పోతే అలానే వుంచండి. మీరు తెవికీ కి మార్చిన తరువాత మరి కొన్ని మార్పులు చేస్తాను.
  • ఈ పేజీలో మొదటి సమీక్షలో సూచనలకి మీరు స్పందించితే దానికి తగ్గట్టుగా సహాయము చెయ్యటానికి సులభమవుతుంది.-- Arjunaraoc 07:28, 7 సెప్టెంబరు 2010 (UTC)Reply
Return to "తెలుగు విక్షనరీ అభివృద్ధి-T.sujatha" page.