వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

రాజమహేంద్రపురము దగ్గర గోదావరినదికి దక్షిణపు ఒడ్డున ఉండు కోవూరిక్షేత్రవాసి అగు గౌతముఁడు తపము ఆచరించుచు ఉండఁగా ద్వాదశవర్షక్షామము ఒకటి సంభవించెను. అప్పుడు అక్కడ ఉండిన ఋషులు అందఱును అతని చెంతకు వచ్చిరి. అతఁడు వారిని ఆదరించి ప్రతిదినమును తాను అనుష్ఠానమునకు కూర్చుండఁ బోవునపుడు పిడికెఁడు వడ్లు కొనిపోయి గోదావరి యిసుకలో మడిచేసి చల్లివచ్చిన ఆవడ్లు అతని తపోమహిమచే అప్పుడె మొలచి పైరై ఆయన అనుష్ఠానము నెఱవేర్చుకొనునంతలో పండి సిద్ధము ఆగును. అంతట ఆధాన్యమును తెచ్చి తనయొద్దకు వచ్చియుండు ఋషులకు అందఱకు భోజనము జరగించును. ఇట్లు పండ్రెండు ఏండ్లును కడపి క్షామము తీఱఁగానే ఆఋషులు అందఱు తమ తమ నివాసములకు పోవుచు గౌతముని తమవెంట రమ్ము అని వేఁడిరి. అందులకు అతఁడు ఒప్పకపోఁగా వారు ఒక మాయాగోవును సృష్టిచేసి అతఁడు నిత్యము వేసికొను వరిపైరును మేసి పోవునట్లు చేసిరి. అప్పుడు గౌతముఁడు ఒక దర్భకఱ్ఱతో దానిని కొట్టి అదిలింపఁగా అంతమాత్రముననే ఆమాయాగోవు తన దూడతో కూడ పడి చచ్చెను. అంతట ఆఋషులు గౌతముఁడు గోహత్య చేసెను అని నిందించి అతనినని చాంద్రాయణవ్రతము ఆచరింపుము అని విధించి చనిరి. కనుక ఎవరేని అదలించిన మాత్రమున మిక్కిలి బాధింపఁబడిన వారివలె అభినయించిరేని "అబ్బా గౌతముని గోవురా ఇది" అని అందుర.............................[పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 ]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>