గోపగృహిణీన్యాయం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక రాజుకు ఒక భార్య ఉండేది. ఆమెకు రాజువల్ల ఒక కొడుకు పుట్టినాడు. ఆమెకు మాత్రం రాజుమీద ప్రేమ లేదు. మరొకరిని ప్రేమించి ఒకనాడు ఆ రాజుకు విషమిచ్చి చంపి ప్రేమికుని దగ్గరకు పోగా వాడు పాము కరచి చచ్చి ఉన్నాడు. వానిని వదలి ఆమె మరోదేశానికి పోయి వేశ్యావృత్తిని అవలంబించింది. దైవవశాత్తు పూర్వం తనకు రాజువల్ల పుట్టిన కొడుకే ఆమె వేశ్య కదా అని ఆమెతో క్రీడించడానికి వస్తాడు. వారికి తాము తల్లీకొడుకులమనే విషయం తెలుస్తుంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా చితి పేర్చుకొని చావాలని నిర్ణయించుకుంటారు. దానిమీదికెక్కి రాజకుమారుడు చనిపోతాడు. కాని ఆమె చితినుండి నదిలో దూకి కొట్టుకొనిపోతూ ఉండగా ఒక గొల్లవాడు ఆమెను ఒడ్డుకు చేర్చి తన భార్యగా చేసుకుంటాడు. ఆమె పెరుగు కుండను తలమీద పెట్టుకొని వీధుల్లో అమ్ముతుంటుంది. ఒచోట ఆమె కాలు జారి కుండ కిందపడి బద్దలయ్యింది. పెరుగంతా బుగ్గిలో పడింది. ఆది చూచి ఏడుస్తూ ఆమె ఈ విధంగా అనుకున్నది- "హత్వా నృపం పతిమవాప్య భుజంగదష్టం, దేశాన్తరే విధివశాద్గణికాఽస్మి జాతా, పుత్రం స్వకం సమధిగమ్య చితాం ప్రవిష్టా, శోచామి గోపగృహిణీ కథమద్య తక్రమ్‌"

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>