వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/ రూ: గోత్రము

వ్యుత్పత్తి

బహువచనము: గోత్రాలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

వంశాన్ని తెలియజేసే ఒక సంకేతం. గోత్ర ప్రవరుడు అంటే కూటస్థుడు/ వంశానికి మూల పురుషుడు అని అర్థం. అన్ని కులాల వారికీ గోత్రాలు ఉంటాయి. అవి వంశం గురించి తెలుసుకొనడానికి ఉపయోగ పడతాయి. కొన్ని కులాల గోత్రాలుగా ఋషుల పేర్లు ఉంటాయి. అవి మూల పురుషులవీ కావచ్చు, గురువులవీ కావచ్చు. గోత్రంతో పాటు ఋషి గణాలను గుర్తుచేస్తూ కొందరు ఋషుల పేర్లను కూడా ప్రవరలో చెప్పడం సంప్రదాయం. ఒకరు నుంచి పదునెనిమిది మంది వరకు ఋషులు ఉన్న గోత్రాలు ఉన్నాయి. కాని సాధారణంగా త్రయా ర్షేయులూ, పంచార్షేయులూ, సప్తార్షేయులే కనిపిస్తుంటారు. సగోత్రీకుల మధ్య వివాహాలు జరగవు. ఋషులలో సగం కంటె ఎక్కువ మంది కలసినా వివాహాలకు సంప్రదాయ కుటుంబాల వారు ఇష్టపడరు. తప్పని సరైనప్పుడు వధువునో, వరుడినో మరో గోత్రీకుడికి దత్తత ఇచ్చినట్లు లాంఛనం జరిపి మంత్రాలలో మారిన గోత్రం పేరు చెప్పి, వివాహాలు జరిపించిన సందర్భాలు ఉన్నాయి. గోత్రాలు ఇన్ని అని చెప్పడానికి వీలులేదు. అసంఖ్యాకంగా గోత్రాలు ఉన్నాయి. కాని, కొందరు ఋషుల పేర్లు తరచుగా గోత్రాలుగా వినిపిస్తుంటాయి. ఆత్రేయ, కాశ్యప, కౌండిన్య, కౌశిక, గౌతమ, గార్గేయ, భారద్వాజ, ముద్గల, శతమర్షణ, శ్రీవత్స మొదలైనవి ఇలా యాభై వరకు ఉన్నాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గోత్రం&oldid=953906" నుండి వెలికితీశారు