గుంటిపోగు
గత కాలంలో ఎవరైన మరణించి నప్పుడు.. శవయాత్ర సందర్బంగా.... ముదుగా ఒక వ్వక్తి సాధారణంగా ఆ వూరి తలారి గుంటి పోగు ను కాలుస్తుంటాడు. గుంటి పోగు = ఒక నాలుగడుగులు పొడవున్న వెదురు కర్రకు ఒక కొసన ఒక బలమైన ఇనుప గొట్టాన్ని దిగ కొట్టి వుంటారు. ఆ గొట్టంలో క్రింది బాగంలో వున్న సన్నని రంద్రంలో ఒక వత్తిని ఉంచి, ఆ గొట్టంలో కొంత వరకు నల్లమందు ను నింపి దానిపైన మరొక కర్ర ముక్కను గట్టిగా దిగ్గొట్టి బయటకు కనబడుతున్న వచ్చికి నిప్పుపెట్టి ఆ కర్రను తుపాకి పట్టు కున్నటు ఆకాశం వైపుకు పట్టుకుంటే. అందులోని నల్లమందుకు నిప్పంటుకొని పెద్ద శబ్దంతో పేలి పైన బిగించిన కర్ర ముక్క ఆకాశంలోకి వెళ్లి పోతుంది. శవ యాత్ర ముందు ఈ గుంటిపోగులను కాలుస్తూనె వుంటారు.