కొసరు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ./దే. అ.క్రి .
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏదేని ఒకవస్తువును తీసికొన్నప్పుడు పెచ్చు తీసికోవడం
- విజృంభించు;/సంకోచించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- విజృంభించు
- సంకోచించు
- ప్రార్థన
- సంబంధిత పదాలు
ఒక సామెతలో: కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ./ కొసరడుగు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- విజృంభించు;= "చ. కొసరి వసంతకాలమున గోయిల క్రోల్చినభంగి నేడ్చె న, బ్బిసరుహనేత్ర." కాశీ. ౪, ఆ.
- సంకోచించు.="క. ఏమీ యిపుడొకవిన్నప, మేమైనం జెప్పుకొన నపేక్షించిన య, ట్లై మోముతోచుచున్నది, యోమునివర కొసరనేల యొగిఁ జెప్పుమనన్." పర. ౫, ఆ.
- ప్రార్థించు.= "సీ. జోగిణిఁ గొసరిబై సుకవెట్టి పలకపై సారెలువోయించి సరము చూచి." ఉ, హరి. ౩, ఆ.
- ప్రార్థనము;= "ఉ. మ్రొక్కులు పల్కుమోడివిసరుల్ కసరుల్ కొసరుల్ చెలంగ." శశాం. ౩, ఆ.
- సంకోచము. ="ఎ, గీ. సింహబలు డత్యుదగ్రతఁ జిగురుబోడి, పజ్జ గడువడి దగిలి కోపంబుగదుర, నొడిసి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తిఁ, గొంకు కొసరించుకయులేక కూలదాచె." భార. విరా. ౨, ఆ.