కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



నిజానికి ఈ సామెత కూసే గాడిద వచ్చి మోసే గాడిదను చెడగొట్టినట్టు. కానీ కాలక్రమాన మోసే కాస్తా మేసే గా మారిపోయింది. గాడిదను సామాన్యంగా బరువులు మొయ్యటానికి వాడతారు. ఏ బరువూ మొయ్యకుండా ఊరికే కూసే గాడిదను చూసి, మోసే గాడిద కూడా చెడిపోయి తాను చేసే పని మానేసిందని భావం. . పనీ పాటా లేకుండా తిరుగుతూ, చక్కగా పని చేసుకుంటున్న వారిని చెడగొట్టే వారి గురించి ఈ సామెత వాడతారు.