వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

[బౌద్ధ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సంస్కృత శబ్దం క్లేశం. సంస్మృత శబ్దానికి దుఃఖం అని అర్థం. పతంజలి యోగసూత్రాల సమాధి పాదంలో క్లేశాల ప్రస్తావన వస్తుంది. అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం అనేవి క్లేశాలని ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు తమ ‘‘యోగదర్శనమ్‌’’ గ్రంథం వ్యాఖ్యానంలో వ్రాశారు. క్లేశాలకు ప్రసుప్త, తను, విచ్ఛిన్న, ఉదారాలనే నాలుగు అవస్థలు ఉన్నాయి. ఇవిగాక ఐదవది దగ్ధ బీజావస్థ. చిత్తం లయమైనప్పుడు అవి కూడా లయం అవుతాయి కనుక కొందరు ఐదవ దానిని పరిగణనలోకి తీసుకొనరు. కిలేస శబ్దానికి బౌద్ధ పరిభాషలో మనస్సును మలినం చేసే దోషం/ దుర్గుణం అని అర్థం. అలాంటివి పది ఉన్నాయి. అవి: 1. లోభం, 2. ద్వేషం, 3. మోహం (భ్రాంతి జనిత భావన), 4. దిట్ఠి (ఇది పాళీ పదం. కేవలం ఊహించుకొని, ఆపైన ఏదైనా చేయడం), 5. మాన ( ఇది కూడా పాళీ పదం. తనను గురించి తాను అతిగా భావించడం అని భావం), 6. విచికిత్స (సంస్కృతం)/ విచికిచ్చ (పాళీ). ఏది చేస్తే ఏమవుతుందో అని మథనపడటం. 7. థీన-మిద్ధ (సోమరితనం/ స్తబ్ధత), 8. ఉద్ధచ్ఛ (తొందరపాటు), 9. అహిరిక (సిగ్గుమాలిన తనం), 10. అనొత్తప్ప (పాపభీతి లేకపోవడం/ అంతరాత్మ అనేదొకటి లేదేమో అన్నట్లు ప్రవర్తించడం.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కిలేస&oldid=898139" నుండి వెలికితీశారు