ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
నీటిలో మునిగిన వానికే ఆ నీటి లోతు, చలి ఇతరత్రా సాధకబాధకాలు తెలుస్తాయి. ఒడ్డున నిలబడి చూసే వానికి అవేమీ పట్టవు సరికదా, అంతా బాగానే ఉందనుకుంటాడు. ఇదే విషయాన్ని కష్టాలలో ఉన్నవానికి , ఇవన్నీ మామూలే అంటూ ఉచిత సలహాలిచ్చేవాణ్ణి ఉద్ధేశించి ఈ సామెత ద్వారా చెబుతారు.