హిందూ పురాణాల ప్రకారం ఐరావతం అంటే ఇంద్రుడి ఏనుగు. ఇది తెల్లగా ఉంటుంది. పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మిదేవి, కల్పవృక్షం, కామధేనువులతో పాటు ఐరావతం ఉద్భవించినట్లు పౌరాణిక గాధ.
ఎంతో శ్రమ, డబ్బు, సమయం వెచ్చించి చేసిన పని అనుకున్న ఫలితాన్ని ఇవ్వని సందర్భంలో సదరు పనిని ఐరావతంగా/తెల్ల ఏనుగుగా అభివర్ణించడం కద్దు. ఉదాహరణ: ఎంతో ఖర్చు పెట్టి పురపాలక సంఘం దిగుమతి చేసుకున్న రోడ్లు ఊడ్చే యంత్రం మన పరిస్థితులకు అనుగుణంగా పని చెయ్యలేక పోయి ఐరావతం లాగా తయారయింది.