ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
ఏడ్చేవాడు ఏడుస్తూ ఎడమ చేత్తో ముక్కు చీదుతూ ఉంటాడు కాబట్టి వాడికి ఎడమ ప్రక్కన, కుట్టేవాడు సూదిని కుడిచేత్తో పట్టుకుని కుడుతూ ఉంటాడు కాబట్టి అది మనకు గుచ్చుకోవచ్చు అందువలన వాడికి కుడిప్రక్కన కూర్చుంటే ప్రమాదం. ఎవరైనా తెలిసి తెలిసి ప్రమాదం కోరి తెచ్చుకుంటున్నప్పుడు ఈ సామెతను వాడతారు.