ఎమీనో ఆమ్లాలు
ఎమైనో లేదా ఎమీనో ఆమ్లాలు
<small>మార్చు</small>ఎమీనో ఆమ్లాలు (Amino acids) నిర్మాణంలో అమినో (-NH2) గ్రూపు, ఒక కార్బాక్సిల్ (-COOH) గ్రూపు ఉంటాయి. ఇప్పటి వరకు 100 పైగా ఎమీనో ఆమ్లాలను వేరుపరచి గుర్తించారు. వీటిలో చాలావరకు ఆల్ఫా ఎమీనో ఆమ్లాలు. జీవుల నుండి లభించే ఎమీనో ఆమ్లాలలో 20 ఆమ్లాలు మాంసకృత్తుల జల విశ్లేషణ నుండి లభ్యమైనాయి. వీనిని 'సహజ ఎమీనో ఆమ్లాలు' అంటారు. మిగిలిన ఎమీనో ఆమ్లాలు జీవ ప్రక్రియలలో మధ్యస్థ పదార్ధాలుగా గాని, అంత్య పదార్ధాలుగా గాని లభిస్తాయి. సహజ ఎమీనో ఆమ్లాలలో 8 అత్యవసర అమినో ఆమ్లాలు (essential amino acids). మానవ శరీరాలు వీటిని సంశ్లేషణ చేసుకోలేవు. అందువలన వీటిని తినే ఆహార పదార్ధాల ద్వారా సరఫరా చేసుకోవాలి.
అమినో ఆమ్లం | 3-అక్షరాల పేరు | 1-అక్షరం పేరు | పక్క గొలుసు ధ్రువత్వం | పక్క గొలుసు యొక్క ఆమ్లత్వం లేక క్షారత్వం | Hydropathy index |
---|---|---|---|---|---|
అలనీన్ | Ala | A | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | 1.8 |
ఆర్జినీన్ | Arg | R | ధ్రువత్వం ఉంది (polar) | క్షారత్వం (strongly basic) | -4.5 |
ఆస్పర్టీన్ | Asn | N | ధ్రువత్వం ఉంది (polar) | మధ్యస్థం (neutral) | -3.5 |
ఆస్పార్టిక్ ఆమ్లం | Asp | D | ధ్రువత్వం ఉంది (polar) | ఆమ్లత్వం (acidic) | -3.5 |
సిస్టైన్ | Cys | C | ధ్రువత్వం ఉంది (polar) | మధ్యస్థం (neutral) | 2.5 |
గ్లుటామిక్ ఆమ్లం | Glu | E | ధ్రువత్వం ఉంది (polar) | ఆమ్లత్వం (acidic) | -3.5 |
గ్లుటమీన్ | Gln | Q | ధ్రువత్వం ఉంది (polar) | మధ్యస్థం (neutral) | -3.5 |
గ్లయిసీన్ | Gly | G | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | -0.4 |
హిస్టిడీన్ | His | H | ధ్రువత్వం ఉంది (polar) | క్షారత్వం (కొద్దిగా) | -3.2 |
ఐసోలూసీన్ | Ile | I | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | 4.5 |
లూసీన్ | Leu | L | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | 3.8 |
లైసీన్ | Lys | K | ధ్రువత్వం ఉంది (polar) | క్షారత్వం (basic) | -3.9 |
మిథియొనీన్ | Met | M | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | 1.9 |
ఫినైన్ అలనీన్ | Phe | F | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | 2.8 |
ప్రొలీన్ | Pro | P | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | -1.6 |
సెరీన్ | Ser | S | ధ్రువత్వం ఉంది (polar) | మధ్యస్థం (neutral) | -0.8 |
థ్రియోనీన్ | Thrఎమీనో ఆమ్లాలు | T | ధ్రువత్వం ఉంది (polar) | మధ్యస్థం (neutral) | -0.7 |
ట్రిప్టోఫాన్ | Trp | W | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | -0.9 |
టైరోజీన్ | Tyr | Y | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | -1.3 |
వేలీన్ | Val | V | ధ్రువత్వం లేదు (nonpolar) | మధ్యస్థం (neutral) | 4.2 |