ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి
పల్లటూళ్ళలో పెళ్ళి జరిగినప్పుడు భోజనాలు ఆరుబయటగాని, పందిరివేసి గాని విస్తళ్ళలో వడ్డిస్తారు. విందుభోజనాల ఘుమఘుమలకు ఊళ్ళోని కుక్కలన్నీ భోజనాల పందిరి దగ్గర చేరి విసిరేసిన విస్తళ్ళ దగ్గర కాట్లాడుకుంటూ తెగ హడావిడి చేస్తాయి. పెళ్ళివారికీ ఊళ్ళొని కుక్కలకీ ఏ సంబంథం ఉండదు. అలాగే తమకు సంబంధంలేని విషయాల్లో తలదూర్చి కొందరు హడావిడి చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు.