వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. శిక్ష, 2. వ్యాకరణము, 3. నిరుక్తము, 4. జ్యోతిషము [(1) గణితశాస్త్రము (2) వాస్తుశాస్త్రము (3)శకునశాస్త్రము (4)స్వరశాస్త్రము (5)ప్రశ్నశాస్త్రము], 5. కల్పము, 6. ఛందస్సు, 7. ఋగ్వేదము, 8. ఋగ్వేదోపవేదము (ఆయుర్వేదము) [(1) ధాతురసవాదము (2) అంజనవిద్య (3)వశ్యౌషధ ప్రయోగము (4)పాకశాస్త్రము (5)దోహదశాస్త్రము, దాడిమాదివృక్షదోహదము], 9. యజుర్వేదము (దీని చేత దేవతలు పూజింపబడుదురు) [(1)కామశాస్త్రము], 10. యజుర్వేదోపవేదము (అర్థవేదము) [(1) స్వర్ణరత్నాది పరీక్ష (2) ద్యూతము=ప్రాణిద్యూతము, అప్రాణిద్యూతము అని ద్వివిధము (3) కృషి (4)వాణిజ్యము (5)గోశాస్త్రము (6)భూపరీక్ష (7)సూచీవానకర్మ (సూదుల చేతఁ గుట్టుపని విశేషములు)], 11. అధర్వణవేదము [(1)ఆగమములు 28 - కామికాగమము, యోగము, చింత్యము, కారణము, అజితము, దీప్తము, సూక్ష్మము, సహస్రము, అంశుమత్తు, సుప్రభేదము, విజయము, నిశ్వాసము, స్వాయంభువము, అనలము, వీరము, రౌరవము, విమలము, చంద్రజ్ఞానము, బింబము, తంత్రము, ప్రోద్గీతము, లలితము, స్నిగ్ధము, సంతానము, సర్వోక్తము, పారమేశ్వరము, కిరణము, వాతూలము. ఈ యాగములయం దనేక మంత్రయంత్రతంత్ర ప్రయోగాదులఁ దెలియజేయునవి (2) ఐంద్రజాలికము (లేనిది యున్నట్టును, ఉన్నది లేనట్టును, చూచువారి కన్నులకు భ్రమగల్పించునది) అవాంతరములు -మహేంద్రజాలము, గజకర్ణము, గోకర్ణము, గారడి, కనుకట్టు, హస్తలాఘవాదులు. (3) ప్రయోగము- ఆకర్షణము, స్తంభనము, మారణము, మోహనము, వశీకరణము, ఉచ్చాటనములను నాఱు విధములగు మంత్రప్రయోగములఁ దెలుపునది : మంత్రశక్తిచే జలము, అగ్ని, వాయువు, వాక్కు, దృష్టి, శుక్లము, భుజము, ఖడ్గము మొదలగువానిని స్తంభింపఁ జేయువిధ మెఱింగించునది], 12. ధనుర్వేదము (అధర్వవేదోపవేదము) [(1) మల్లశాస్త్రము : ఈ శాస్త్ర విషయ గ్రంథము లంతరించినను గొన్నివిషయములు లోకానుచారంబుగా నున్నవాని నీ నిఘంటురాజమందుఁ జూపఁబడియె : 12 దండలు, 12 గతులు, 12 పరువళ్ళు, 12 మొనలు, 12 కాయమానములు, 14 విసరులు, 16 ఉపవీతములు, 32 విన్నాణములు, 32 ప్రచారములు, 8 నఱకులు మొదలగునవి.) (2) గజశాస్త్రము (3) వ్యూహశాస్త్రము : కామందకమునఁ జెప్పినరీతి నిందు వివరింపఁబడియె.- ప్రకృతి వ్యూహములు 4, దండవ్యూహములు 17, భోగవ్యూహములు 5, మండలవ్యూహములు 2, అసంహత వ్యూహములు 6, ప్రధానవ్యూహములు 6 (గురుమతమున వ్యూహాంగములు 7, శుక్రమతమున వ్యూహాంగములు 5) (4) అశ్వహృదయ పరిజ్ఞానము, సారథి రథికుల యొక్కయుత్సాహము], 13. సామవేదము, 14. గాంధర్వవేదము (సామవేదోపవేదము) [వానిలో నాట్యోపయోగములైన యంగములు19, శిరఃక్రియలు 17, దృష్టిక్రియలు18, రసదృష్టులు 8, రసస్థాయీభావమునఁబుట్టిన దృష్టులు 8, సంచారీభావమునఁ బుట్టిన దృష్టులు 20, తారాక్రియలు 9, పుటక్రియలు 9, భ్రూక్రియలు 7, నాసికాక్రియలు 6, గండక్రియలు 6, అధరము 6, చిబుకము 8, ముఖక్రియలు 6, కంఠక్రియలు 4, హస్తక్రియాభేదములు -బాహుప్రచారములు 10, హస్తక్రియలు 20, హస్తప్రచారములు 15, హస్తకరణములు 4,హస్తక్షేత్రములు 3, ఉత్తమక్షేత్రములు3, మధ్యమక్షేత్రములు5, అధమక్షేత్రములు 6 (మతాంతరము : హస్తక్షేత్రములు 13), అసంయుతహస్తములు 45, సంయుతహస్తములు 32, నృత్తహస్తములు 29, హస్తప్రాణములు 12, వక్షఃక్రియలు 5, జఠరక్రియలు 3, పార్శ్వక్రియలు 5. కటిక్రియలు 5, ఊరూక్రియలు 5, జంఘాక్రియలు 5, చరణక్రియలు 6, స్థానకములు 30, పుంస్థానకములు 6, స్త్రీస్థానకములు 3, ఏకవింశతి స్థానకములు 21, భూచారులు 16, ఆకాశచారులు 16, భౌమ మండలములు 10, ఆకాశమండలములు 10, కరణములు 108 మున్నగునవి వాఁడబడుచున్నవి : ఇది నందికేశ్వర విరచితమగు భరతార్ణవాది గ్రంథములలో లక్షణ వినియోగములతో వివరింపఁబడి యున్నది.]; [మఱియు కావ్యములు 2, సాహిత్యకావ్యములు 2, రీతులు 4, వృత్తులు 4, గుణములు 23, పాకములు 4, శబ్దాలంకారములు 39, అర్థాలంకారములు 100, రసవదలంకారములు 18, రసస్థాయీభావములు9, సంచారీభావములు 33, శృంగారచేష్టలు 18, ద్వాదశావస్థలు 12, విప్రలంభము 4, అర్థాంతర సంక్రమిత వాచ్యములు 2, అత్యంత తిరస్కృతవాచ్యములు 2. అభిధామూలధ్వనులు 3, సంలక్ష్యక్రమవ్యంగ్యము 3, శబ్దశక్తిమూలానురణనరూప వ్యంగ్యము 4, అర్థశక్తి మూలానురణనరూపవ్యంగ్యము 1, ధ్వనిభేదములు 1326ను సంకరములతోఁ గూడిన 5304 వీటితోఁగూడిన కార్యముఁగూడ ధ్వనియనిపించుకొనును. ఇదే యుత్తమ కావ్యము]; [ఇక రాగాధ్యాయమును తెలిసికొనవలెను. రాగజ్ఞానమును గుఱించి యపేక్షితములయిన అష్టాదశపదార్థములలో నాదము 2, శ్రుతులు 22, స్వరము 7, స్థాయి 3, గ్రామము 3, షడ్జగ్రామగతమూర్ఛనలు 7, మధ్యమగ్రామగత మూర్ఛనలు7, గాంధారగ్రామగత మూర్ఛనలు 7. (అందు తానముల వివరము షడ్జమధ్యమగ్రామములలోఁ జెప్పఁబడిన మూర్ఛనాసప్తకద్వయములో ప్రత్యేకమతాంతర భేదములు నాలుగు కలవు. వాటిచేత నొక్కొక్క సప్తక మిరువదెనిమిది భేదములుగానైనది. అవాంతరభేదములు 4, తానములు 3, శుద్ధతానములు 28; సహీనతానములు 7, రిహీనతానములు 7, ధహీనతానములు 7, నిహీనతానములు 7, కూటతానములు 28; రహీనతానములు 7, రిహీనతానములు 7, గహీనతానములు 7, మహీనతానములు 7, సర్వతానములు 28; స-మ-హీన తానములు 7, ప-రి-హీనతానములు 7, రి -ధ-హీనతానములు 7, ని-గ-హీనతానములు7, ప-రి-హీనతానములు 7]; వర్ణచతుష్కము, అలంకారములు 63 (స్థాయీవర్ణగతాలంకారములు7, ఆరోహివర్ణగతాలంకారములు 12, అవరోహివర్ణగతాలంకారములు 12, సంచారీవర్ణగతాలంకారములు 25), అలంకారములు 7, గమకములు 15]; [అంశములు : శుద్ధజాతులు 7, జాతులు 11, సప్తస్వర యుక్తరాగములు, షట్చ్వరయుక్తరాగములు, పంచస్వరయుక్తరాగములు, చతుస్స్వర యుక్తరాగములు, త్రిస్వర యుక్తరాగములు, ద్విస్వర యుక్త రాగములు, ఏకస్వర యుక్తరాగములు; మఱియు రాగాంగములు13]; [భాషలు - సౌవీరజభాషలు 4, కకుజభాషలు7, టక్కజభాషలు21, పంచమజ భాషలు 10, భిన్నపంచమజభాషలు 4, ఉత్కల కైశికిజభాషలు 2, హిందోళజభాషలు 9, భోటజభాష 1, మాళవకైశికిభాషలు 13, గాంధార పంచమజభాష 1, భిన్నషడ్జకజభాషలు 17, వేసరషాడవజభాషలు 2, మాళవపంచమజ భాషలు 3, తానజభాష 1, పంచమషాడవజభాషలు3]; [సౌవీరాది 15 జనకరాగములయందుఁ బుట్టిన భాషారాగములు : భాషాంగములు 11; విభాషలు 20 (కకుజవిభాషలు 3, టక్కజవిభాషలు 4, పంచమిజభాషలు 2, భిన్నపంచమిజభాష 1, ఉత్కళకైశికిజవిభాష 1, మాళవకైశికిజవిభాషలు 2, భిన్నషడ్జజవిభాష 4, వేసరషాడవజవిభాషలు 2, పంచమషాడవజవిభాష 1), అంతరభాషలు 4 (కకుజభాషాంతభాష 1, పంచమషాడవజాంతర భాషలు 3)]; [ఉపాంగములు 4 (వరాట్యుపాంగములు 6, తుండ్యుపాంగములు 2, ఘూర్జర్యుపాంగములు 4, వేళావశ్యుపాంగములు 4), క్రియాంగములు 12. [మఱియు సామకృతి, గౌడకృతి, దేవకృతి, నాదము మొదలు క్రియాంగము పర్యంతమునైన యష్టాదశపదార్థములను సంగీతరత్నాకరము మొదలగు గ్రంథములలోఁ జెప్పఁబడియున్న ప్రకారముగ నుద్దేశలక్షణవినియోగములను సద్గురుముఖము వలన సంప్రదాయపూర్వకముగఁ జదువుకొని వాటిని నిండా అభ్యసించి సాధించి జితశ్రముఁడై సందష్టోష్ఠత మొదలుకొని సానునాసికత్వ పర్యంతమునైన నిరువదిమూఁడు గాయకత్వ దోషములలో నేదోషమును జెందక రూక్షత్వము మొదలుగాగల కంఠధ్వనిదోషములు లేక సుగుణములు యిరువదెనిమిది మొదలగునవి కలిగియున్న గాయకోత్తముఁడు తాళవర్జితములు మొదలగు దోషములు లేక ప్రభుసభయందు సభాసదుల కాహ్లాదనార్థముగఁ బాడవలసినరీతిని యాఱు విధములుగ వినికిఁ జేసిన శాస్త్రపండితుఁడనఁబడును. ]; [ఇక తాళాధ్యాయము చూతము : తాళము అనఁగ తలనక్రియ (అనఁగా నృత్తగీతముల యొక్క అనుద్రాది ప్రమాణసహితమైన పదకవితా దళ్తావృత్తకాలమును అవాప, నిష్క్రామాది క్రియల చేతఁగొలిచి సరిపెట్టి నిలుపుట). తాళమునకు ప్రాణములు 10 (కాలప్రాణములు 12, మార్గప్రాణములు 6, నిశ్శబ్దక్రియలు 4, సశబ్దక్రియలు, 4. దేశీయక్రియలు 8, అంగప్రాణములు 6, గ్రహప్రాణములు 4, జాతిక్రియలు 5, ముఖ్యకళాప్రాణములు 5 - ఈ యైదింటియందే 96 తాళములు పుట్టి 101 తాళమయ్యెను.), జన్యతాళములు 96, లయప్రాణములు 3, యతిప్రాణములు 6, ప్రస్తారప్రత్యయ ప్రాణములు 19, సూడకములు (సూళాది సప్తతాళములు) 7, వాద్యములు 4, తతవాద్యములు 20, ఆనద్ధవాద్యములు 18, సుషిర వాద్యములు 10, ఘనవాద్యములు 6, పంచమహావాద్యములు 5], 15. మీమాంస - మీమాంస అనఁగా విచారణ. [(1) యోగశాస్త్రము (2) సాంఖ్యము (3) వేదాంతశాస్త్రము (4) అలంకారశాస్త్రము (5) అణిమాది సిద్ధులు (6) అదృశ్యము (7) పరకాయప్రవేశము (8) ఆకాశగమనము మున్నగునవి.], 16. న్యాయశాస్త్రము - న్యాయము అనఁగా దృష్టాంతము, 17. పురాణము, 18. ధర్మశాస్త్రము. [(1) సాముద్రికము - ఇందు లక్షణాంగములు 58] : మహావిద్యలు 18. ఉపవిద్యలు 46 ను గూడి చతుష్షష్టివిద్యలయ్యె.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>