వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

[బౌద్ధ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మొదలైనవి. అన్నీ కలసి 22. అవి: 1. చక్ఖు (కన్ను),2. సోత (చెవి), 3. ఘాన (ఘ్రాణ/ ముక్కు), 4. జివ్హా (జిహ్వ/ నాలుక), 5. కాయం (శరీరం), 6. మనో (మనస్సు), 7. ఇత్థి (స్త్రీత్వం), 8. పురిస (పురుషత్వం), 9. జీవిత (పటుత్వం/ దార్డÛ్యం), 10. సుఖం (శారీరక సుఖం), 11. దుఃఖం (భౌతికమైన బాధ), 12. సోమనస్స (సంతోషం), 13. దొమనస్స (శోకం/ సంతాపం), 14. ఉపేక్ఖ (ఉపేక్ష/ పట్టించుకొనకపోవడం మాత్రమే కాదు. ఇష్టాయిష్టాలు లేని ఒక మానసిక స్థితి ఇది అని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ తమ ‘‘బుద్ధుడు- ఆయన ధమ్మ’’ అనే పుస్తకంలో వ్రాశారు. అంబేడ్కర్‌ రచనలు- ప్రసంగాల 11వ సంపుటం- 128వ పేజీ), 15. సద్ధా (విశ్వాసం), 16. విరియ (పరిశ్రమ), 17. సతి (అప్రమత్తత), 18. సమాధి (ఏకాగ్రత), 19. పఞ్ఞ (ప్రజ్ఞ/ విజ్ఞత), 20. అనజ్ఞాతజ్ఞ స్సామీతి ఇంద్రియ (ఇంతవరకు తెలియని దానిని తెలుసుకొని తీరుతా అనే దృఢ నిశ్చయం), 21. అఞ్ఞింద్రియం (అత్యున్నత జ్ఞాన శక్తి), 22. అఞ్ఞాతావింద్రియ (సర్వజ్ఞ ప్రజ్ఞ). ఇందులో మొదటి ఐదు, ఏడవ, ఎనిమిదవ అంశాలు భౌతికమైనవి. తొమ్మిదవ దైన ‘జీవిత’ భౌతికం, మానసికం కూడా. మిగతా పదునాలుగూ భావ సంబంధులు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఇంద్రియ&oldid=905966" నుండి వెలికితీశారు