అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



ఇది అజ్ఞానానికీ, అతి తెలివికీ పరాకాష్టగా చెప్పే సామెత. తెలియక పోయినా తెలిసినట్లు నటించేవారి అంటించే చురక.

అల్లం కారంగా, ఘాటుగా ఉంటుంది; బెల్లం తీయగా ఉంటుంది. ఇక పుల్లగా ఉండేవి వేరే పదార్ధాలున్నాయి. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటది అని ఎవరైనా అంటే వారికి అల్లం రుచి తెలియదు. బెల్లం రుచి తెలియదు. పుల్లగా ఉండేదేమిటో తెలియదు. కనుక ఒకటి అడిగితే మూడు విషయాలు తెలియవని చెప్పుకున్నారు. కనీసం తన తెలియనితనాన్ని దాచుకోవాలన్న జ్ఞానం కూడా వారికి లేదన్న మాట.

ఇదే అర్ధంలో చెప్పే మరొక సామెత:

పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు.