అప్పిచ్చువాడు వైద్యుడు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


సుమతీశతకం సృష్టించిన జాతీయాలు, సామెతల్లో ఇది ఒకటి. శతకం చెప్పిన రూపం మారిపోయి దీనికి మరో అర్థం తోడవుతున్న సమయమిది. పద్యమిలా ఉంది.

అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ

పై పద్యానికి అర్థం తెలిసిపోతూనే ఉంది. అప్పిచ్చేవాడు, వైద్యుడు, సమృద్ధిగా నీరు, బ్రాహ్మణుడు మొదలైనవి దొరికే ఊళ్ళోనే ఉండాలి. అవి లేని ఊళ్ళో ఉండరాదు.

అయితే, ప్రస్తుతం మొదటి పాదానికి అర్థం మారిపోతూంది. వైద్యుడంటే అప్పిచ్చేవాడనే అర్థంలో కొందరు వాడుతున్నారు. పద్యం తెలిసినవారు శ్లేషార్థంలో వాడుతుంటే.., పూర్తి పద్యం తెలియనివారు వైద్యుడికి అప్పిచ్చే బాధ్యత కూడా ఉంది కామోసనీ, అప్పిచ్చేవాడు వైద్యుడితో సమానం కాబోలనీ, వైద్యుడికి అప్పిచ్చే బాధ్యతను ఎందుకు పెట్టారబ్బా మనవాళ్ళు..? అనీ అనుకుంటూ ఉంటారు.