అపవాదన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పూర్వోదాహృతవిషయమునకు బాధకముగా నుడువబడు నుత్తరవాక్యమునకు అపవాదము అని పేరు. ఉదా:- కర్మప్రవృత్తులును భగవంతుని పొందగలదు. కామనయా కర్మప్రవృత్తులుమాత్ర మట్లు పొందనేఱరు. ఇందుల సర్వసామాన్యముగ భగవత్ప్రాప్తిని వచించు మొదటివాక్యము (సామాన్యశాస్త్రము) నకు బాధకముగ కొంతవ్యవస్థ అనగా కామరహితముగ కర్మలయందు ప్రవర్తించువారలు అని కల్పించుచు ప్రవర్తించు రెండవవాక్యము అపవాద (శాస్త్ర)ము అని నుడువఁబడుచున్నది. అట్లే- ఉత్తరాంశమువలనఁ బూర్వాంశమునకు బాధకలుగు సందర్భమున నీన్యాయము ప్రవర్తించును. "అపవాదై రుత్సర్గా బాధ్యన్తే" అను పరిభాషనుండి యీన్యాయ ముత్పన్నమైనది. వ్యాకరణశాస్త్రమున నీ న్యాయమెక్కుడుగ నుపయోగింపబడును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939