అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఒక అసత్యం గురించి, లేని విషయం గురించి ఒకరు చెప్పే విషయాన్ని మరొకరు గుడ్డిగా నమ్మి అది నిజమేననేందుకు ఋజువులు వెదకడం, లేక దొరికే ప్రతిదాన్నీ ఋజువుగా భావించే సందర్భంలో ఇలా అంటారు. అబద్ధం వ్యాప్తి జరిగే విధానం ఇది. అయితే ఇందులో అమాయకత్వం, తెలియనితనం కనిపిస్తాయే గానీ కావాలని ఇతరులను వంచించే ప్రయత్నం కాదు. తాము విన్నదీ, కన్నదీ అబద్ధమని తరువాత తెలుసుకున్నపుడు అనుకుంటారు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లయిందని
కావాలని అబద్ధాన్ని నిజంగా చూపే ప్రయత్నాన్ని వర్ణించడానికి ఒక సామెత ఉంది: ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట