అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేదే అమ్మ.కాని అమ్మ ఐనా కొన్ని సందర్బాలలో ఆకలి తీర్చడం మరచి పోవచ్చు.మొగమాటంతో అమ్మ పెడ్తుందిలే అని ఊరుకుంటే ఆకలి తీరేదెలా.అమ్మ దగ్గర మొగమాట పడేవాళ్ళు ఎవరి దగ్గరా చొరవగా ఉండలేరు.చొరవ తీసుకుని అడగక పోతే ఏ పని జరగదు.అన్నిటికీ మొగమాట పడేవారిని చూసి చెప్పే సామెత ఇది.