వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అచ్ఛోద అనునది ఒక పుణ్యనది. ఇది తొలుత మరీచినందనులగు పితృగణములయొక్క మానసకన్యకగా పుట్టి తన పితలచే నిర్మితమగు అచ్ఛోదము అను సరోవరతీరమున సహస్ర దివ్యవర్షములు తపస్సు చేసి పితరుల మెప్పింపగా వారలు దివ్యాలంకారభూషితులయి పొడసూపిరి. అంత ఆపె తన తండ్రులగు వారలలో మావసుఁడు అనువానిని తన పతిఁగా కోరె. ఈ వ్యభిచారముచే ఆమె యోగభ్రష్టయై స్వర్గమునుండి క్రిందికి పడెనుగాని భూమినంటక మధ్యమున నిలిచె. అది దుర్మతియై కోరినను ధీరతచే మావసుడు తన మనమును చలింప నీయకుండుటంజేసి యక్కార్యము ప్రవర్తిల్లిన దినము అమావాస్య అని పరంగె. పితృ సంబంధమగునది కావున ఆదినము పితరులకు ముఖ్యము. ఆదినమునందు వారలకు చేసెడి స్వల్ప క్రియలనైనను వారు అక్షయములుగ భావించి తృప్తిజెందుదురు. అట్లు అచ్ఛోద తలక్రిందుగా పడి పితరులను అందఱను పలుచందముల వినుతించి నా వ్యభిచారమును మన్నించి నాకు మరల గతులు కలుగునటులు కరుణింపుడని వేఁ డఁగా ఆ పితరులు దానిం జూచి నీవిపుడు దేవతలు చేసెడు కర్మఫలములను అనుభవించుచుండి యిరువదియెనిమిదవ ద్వాపరమున మీనయోనియందు పుట్టి సత్యవతి అని పేర్కొనంబడి తొలుత పరాశరమహాముని తేజమున వ్యాసమహామునిని కని పిదప శంతనుని భార్యవై విచిత్రవీర్యుడు చిత్రాంగదుడు అను నిరువురు పుత్రులను కాంచి కడపట అచ్ఛోద అను పుణ్యనదివి అయ్యెదవని చెప్పి అంతర్హితులయిరి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అచ్ఛోద&oldid=890820" నుండి వెలికితీశారు