అగ్నికి వాయువు తోడైనట్లు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


అగ్నిని ఎవరైన చల్లార్చడానికే ప్రయత్నిస్తారు. అలాంటి అగ్నికి వాయువు తోడైతే చల్లార్చడం చాలా కష్టం. మన కోపాన్ని అగ్నితో పోలుస్తారు. ఎవరైనా ఎవరి మీదైనా అగ్నిలాంటి కోపంతో ప్రజ్వరిల్లుతూ ఉన్నప్పుడు పక్కన ఉండే వాళ్ళు కావలసినవాళ్ళైతే ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కాని మద్యన ఉండేవాళ్ళు కానివాళ్ళు ఐతే ఆ కోపాన్ని ఉన్నవీ లేనివి చెప్పి పెంచడానికి చూస్తారు. ఇలాంటి సమయంలో ఈసామెతని వాడుతారు.

అగ్నిలో ఆజ్యం పోసినట్లు అనే సామెతను కూడా ఇలాంటి సందర్భంలో వాడుతారు.

పదాలు <small>మార్చు</small>