అందని ద్రాక్ష పుల్లన

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



ఒక నక్క ఒక రైతు యెక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు,నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి,"ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే,ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.

సామెతలు