వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అంగిరసుడు

1. బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూఁతురును కలిగిరి. ఈయోగసిద్ధి అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొని అతనియందు విశ్వకర్మను కనెను.

' తొల్లి అగ్నిదేవుఁడు దేవతలతోడి యలుకచే హవ్యంబుల వహింపనొల్లక వనమునకు చన దేవతలు అధికతపోవిజృంభితుఁడగు అంగిరసుని అగ్నిపదమునందు ఉంచిరి. అంత కొంతకాలమునకు వెనుక అగ్ని మరలి రాఁగా అంగిరసుఁడు అతనిని ప్రథమాగ్నియయి ఉండుమని తాను అతనికి ప్రథమపుత్రుఁడయి అగ్నిసారూప్యమున తేజరిల్లె. ఈరూపమున ఇతనికి శివ అను భార్యయందు బృహజ్జ్యోతి, బృహత్కీర్తి, బృహన్ముఖుఁడు, బృహన్మతి, బృహద్భానుఁడు, బృహస్పతి, బృహద్బ్రహ్మ అను నేడుగురు కొడుకులును, అనుమతి, రాక, సినీవాలి, కుహువు, అర్చిష్మతి, హవిష్మతి, మహామతి అను నేడుగురు కూఁతులును పుట్టిరి. వీరును వీరి సంతతివారందఱును అగ్నిస్వరూపులయి ఉందురు. ' 2. ఉల్ముకుని కొడుకు. అంగుని తమ్ముఁడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అంగిరుడు&oldid=883951" నుండి వెలికితీశారు